header

Crabs Picle.....పీతల పచ్చడి

Crabs Picle.....పీతల పచ్చడి
కావలిసిన పదార్ధాలు:
ఏటిపీతలు : ఒక కిలో
దనియాల పొడి : 200 గ్రాములు
కారం : 200 గ్రాములు
వెల్లుల్లి : 100 గ్రాములు
ఉప్పు : 6 టీ స్పూన్లు
జీలకర్ర : 75 గ్రాములు
మసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు)
నూనె : 350 గ్రాముల నుండి అర కిలో
గసగసాల పొడి : 75 గ్రాములు
కరివేపాకు : తగినంత
తయారు చేసే విధానం :
ఒకకిలో ఏటి రొయ్యలను శుభ్రంచేసి ముక్కలను అయిదు నిమిషాలపాటు ఉడక బెట్టాలి. అల్లం, వెల్లుల్లిని ముద్దగా తీసికుని నాలుగు స్పూన్ల కారం, రెండు స్పూన్ల మసాలా పొడిని కలిపి, పీతలకు పట్టించి నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన పీతలకు, అల్లం, వెల్లుల్లి ముద్దనూ, ధనియాల పొడిని, మందుగా సిద్ధం చేసుకున్న మసాలానూ కలిపి నూనెలో కలియబెట్టాలి. మిశ్రమానికి నిమ్మరసం కలిపి నిల్వచేసికోవాలి. నిమ్మ ఉప్పుకంటే నిమ్మరసం కలిపితే రుచిగా ఉంటుందని తయారీదారులు చెబుతారు