Fish Pickle...చేపల ఆవకాయ
కావలిసిన పదార్ధాలు:
తోలుతీసిన కొరమీను చేపలు : 700 గ్రాములు
దనియాల పొడి : 75 గ్రాములు
కారం : 200 గ్రాములు
వెల్లుల్లి : 100 గ్రాములు
ఉప్పు : 6 టీ స్పూన్లు
జీలకర్ర పొడి : 75 గ్రాములు
నిమ్మరసం : 12 కాయలు
మసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు)
నూనె : 350 నుండి - అర కిలో
కరివేపాకు : తగినంత
తయారు చేసే విధానం :
ముందుగా తోలుతీసిన కొరమేను చేపలను శుభ్రంగా కడగాలి. చిన్న ముక్కలుగా కోయాలి. ముక్కలకు మసాలా, ఉప్పు కారం మిశ్రమం కలిపిన తరువాత అరగంటసేపు నానబెట్టాలి. బాణాలిలో నూనె పోసి చేపముక్కలను దోరగా వేయించాలి.
తరువాత కారం, ఉప్పు, దనియాల పొడి, వెల్లుల్లి ముక్కలను నూరి మసాలలో నిమ్మరసం కలిపి, చేపల ముక్కలు వేసి నూనెలో కలియబెట్టాలి. ఇలా తయారు చేసిన పచ్చడి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది.