Mutton ... మాంసం పచ్చడి
కావలిసిన పదార్ధాలు:
చికెన్ లేదా మటన్ : ఒక కిలో
దనియాల పొడి : 200 గ్రాములు
కారం : 200 గ్రాములు
వెల్లుల్లి : 100 గ్రాములు
ఉప్పు : 6 టీ స్పూన్లు
జీలకర్ర : 75 గ్రాములు
నిమ్మరసం : 12 కాయలు
మసాలా పొడి : 4 టీస్పూన్లు (లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు)
వేరు శెనగ నూనె : అర కిలో
కరివేపాకు : తగినంత
తయారు చేసే విధానం :
ఒక కిలో బ్రాయిలర్ చికెన్ లేదా మటన్ ను అయిదు నిమిషాల పాటు ఉడకబెట్టాలి. నీరు వార్చిన తరువాత కప్పు నూనె అందులో వేసి ఉడకనివ్వాలి. తరువాత ఇరవై లవంగాలు, ఐదు యాలకులు, రెండుబద్దల దాల్చిన చెక్క మొత్తగా దంచుకోవాలి.
అందులో మసాలా పొడి కలపాలి. ముందుగా వేయించిన మాంసాన్ని అందులో వేయాలి. మాంసాన్ని వేయించిన నూనెను తీసుకుని మసాలా మిశ్రమం, నిమ్మరసం,వెల్లుల్లి గుళ్లు, మసాలాలు అన్ని కలిపి నిల్వ చేసుకోవాలి.