Natukodi Biryani, Country Chicken Biryani.....నాటుకోడి పలావ్
బాస్మతి బియ్యం : అరకిలో (ముందుగా కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి)
నాటుకోడి మాంసం : అరకిలో
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : ఆరు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ : 4 టీస్పూన్లు
కారం : 4 టీ స్పూన్లు
గరం మసాలా : 1 టీస్పూను
నూనె: 4 టీస్పూన్లు
పుదీనా : 1 కట్ట
కొత్తిమీర : 1 కట్ట
టమాటోలు : రెండు
పసుపు : అరటీస్పూను
జాజికాయపొడి : అర టీ స్పూను
జాపత్రి : 1
కొబ్బరిపాలు : అరలీటరు
నెయ్యి : 4 టీ స్పూన్లు
తయారు చేయువిధానం :
కోడి మాంసాన్ని శుభ్రం చేసుకొని కడిగి ఉప్పు, కారం, సగం అల్లం, వెల్లుల్లి పట్టించి నానబెట్టాలి.
బియ్యం కూడా అరగంట సేపు నానబెట్టాలి పుదీనా,కొద్దిగా కరివేపాకు, కొత్తిమీరలను ముద్దగా చేయాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయలను వేసి వేయించాలి. పచ్చిమిర్చి, మిగిలిన అల్లం వెల్లుల్లి,
గరంమసాలా పొడి, పొదీనా, కరివేపాకు ముద్దను వేసి బాగా వేయించాలి. తరువాత నానబెట్టిన మాంసం వేసి మూత పెట్టి ఉడికించాలి. మాంసం ఉడికాక, టమాటో ముక్కలు, కొబ్బరిపాలు,
వేసి మూతపెట్టి రెండునిమిషాలు ఉంచి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. తరువాత నానబెట్టిన బియ్యం వేసి సన్నని మంటమీద ఉడికించాలి. దించే ముందు అనాసపువ్వు, జాజికాయ పొడి,నెయ్యి కలిపి దించుకోవాలి.
శాకా నితిన్ ప్రసాద్, హైదరాబాద్...