header

Methi Palav / మేథీ పలావ్


Methi Palav / మేథీ పలావ్
కావల్సినవి
బియ్యం – 2 కప్పులు
నెయ్యి - రెండు టేబుల్స్పూన్లు
జీలకర్ర – చెంచా
బిర్యానీ ఆకులు – మూడు
దాల్చిన చెక్క -నాలుగు ముక్కలు చిన్నవి
యాలకులు – రెండు
లవంగాలు – నాలుగు
పచ్చిమిర్చి – నాలుగు
ఉల్లిపాయలు – రెండు
మెంతికూర – కట్ట
మిరియాలపొడి – అరచెంచా
గరంమసాలా – చెంచా
ఉడికించిన బంగాళాదుంప ముక్కలు – అరకప్పు
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం
వెడల్పాటి పాన్ లో నెయ్యి వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, బిర్యానీఆకులు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి కూడా వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, మెంతి ఆకులు వేయాలి. మంట తగ్గించి వేయిస్తే పచ్చివాసన పోయి మెంతికూర వేగుతుంది. ఆ తరవాత కడిగిన బియ్యం కూడా వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, గరంమసాలా, మిరియాలపొడి వేసి నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. మూత పెట్టి మంట తగ్గించి ఉంచేయాలి. అన్నం ఉడికాక దింపేస్తే సరిపోతుంది. వేడివేడి మేథీపలావ్ చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికీ మంచిది.