header

Prawance Biryanee...రొయ్యల బిరియాని

Prawance Biryanee...రొయ్యల బిరియాని కావలసినవి :
రొయ్యలు : అర కిలో
బాస్మతి బియ్యం : 2 కప్పులు
ఉల్లిపాయ : సన్నగా ముక్కలు చేయాలి
పచ్చి మర్చి : 2 నిలువుగా చీల్చాలి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు
టమాటోలు : 2 ముక్కలుగా తరుగుకోవాలి
నిమ్మకాయ : ఒకటి
కొత్తిమీర : గుప్పెడు
పొదినా ఆకులు : గుప్పెడు
కారం : 2 స్పూన్లు
ధనియాల పౌడర్ : 1 స్పూను
పసుపు : పావు స్పూను
ఉప్పు : తగినంత
లవంగాలు : 4
పెరుగు : అరకప్పు
దాల్చిన చెక్క : 1 ముక్క
ఏలకులు : రెండు
బిర్యాని ఆకు : 1
జాపత్రి : 1
నెయ్యి : 2 స్పూన్లు
నూనె : 2 స్పూన్లు
తయారు చేయువిధానం : రొయ్యలు ఒలిచి శుభ్రం చేసుకోవాలి. బాగా కడిగి ఒక స్పూను కారం, అర స్పూను ధనియాల పౌడర్, ఒక స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు అన్నింటినీ రొయ్యలకు బాగా పట్టించి పక్కన ఉంచుకోవాలి. పాన్లో నూనె, నెయ్యు వేసి కాగాక దాల్చిన చెక్క, ఏలకులు, బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు వేయాలి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి తరువాత మిగిలిన అల్లం, వెల్లుల్లి పేస్ట్,పచ్చి మిర్చి వేసి పచ్చివాసన పోయే దాకా రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి. తరువాత టమాటోలు, మిగిలిన కారం, ధనియాల పౌడర్, పసుపు వేసి మంచి మషాలా వాసన వచ్చేదాకా వేయించాలి. తరువాత తరిగిన కొతిమీర కొద్దిగా, తరిగిన పొదీనా ఆకులు వేసి 2 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత మషాలా పట్టించిన రొయ్యలను కలపి రెండు నిమిషాలపాటు ఉంచాలి. తరువాత బియ్యం, నిమ్మరసం, మూడు కప్పుల నీళ్ళు కలిపి బాగా కలిపి మొత్తం ఉడికే దాకా ఉంచి దించుకోవాలి. రుచి కోసం కొత్తీమీర చల్లుకోవచ్చు.