header

Badam Burfy


బాదం బర్ఫీ

కావల్సినవి: బాదం - ఒకటిన్నర కప్పు
పాలు - అర లీటరు
నెయ్యి - అరకప్పు
చక్కెర - రెండు కప్పులు
క్రీం - అరకప్పు
యాలకులపొడి - పావుచెంచా
తయారు చేసే విధానం
ముందుగా బాదం గింజల్ని ఇరవై నిమిషాల పాటు వేడినీటిలో నానబెట్టుకోవాలి. తరవాత పొట్టు తీసేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె లో పాలు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగి, చిక్కగా అవుతున్నప్పుడు బాదం మిశ్రమాన్ని వేసేయాలి. ఇప్పుడు మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. దగ్గరకు అవుతుంది. అందులో నెయ్యీ, చక్కెరా, క్రీం, యాలకులపొడి వేసి కలపాలి. మిశ్రమం దగ్గరకు అయ్యాక దింపేసి నెయ్యిరాసిన పళ్లెంలో పరిచి.. బిళ్లల్లా కోస్తే చాలు.