header

Coconu Burfy


కొబ్బరి, రాగితో బర్ఫీ

కావల్సినవి
రాగిపిండి - కప్పు
కొబ్బరి తురుము - కప్పు
బెల్లం తరుగు - ఒకటిన్నర కప్పు
నెయ్యి - అరకప్పు
చక్కెరపొడి - కొద్దిగా
తయారు చేసే విధానం పొయ్యిమీద బాణలి పెట్టి రాగిపిండిని వేసి దోరగా వేయించుకుని తీసి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో బెల్లం తరుగు తీసుకుని, అది మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. బెల్లం కరిగి లేతపాకం పడుతున్నప్పుడు కొబ్బరితురుమూ, రాగిపిండీ వేసి బాగా కలపాలి. మధ్యమధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ, కలుపుతూ ఉంటే.. కాసేపటికి మిశ్రమం దగ్గరపడుతుంది. అప్పుడు నెయ్యిరాసిన పళ్లెంపై పరవాలి. దీనిపై చక్కెరపొడి చల్లి, ముక్కల్లా కోయాలి.