header

Doha Burfy


Doha Burfy

కావలసినవి
దోహా బర్ఫీ
కావల్సినవి: పాలు- నాలుగు కప్పులు
క్రీం – కప్పు
చక్కెర - రెండు కప్పులు
సన్న గోధుమ రవ్వ – కప్పు
నెయ్యి- పావుకప్పు
జీడిపప్పు, బాదం పలుకులు - రెండూ కలిపి అరకప్పు
పిస్తా పలుకులు – కొద్దిగా
చాక్లెట్పొడి - రెండు చెంచాలు.
తయారు చేసే విధానం
బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నెయ్యి వేసి గోధుమ రవ్వను దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉన్న గిన్నెను పొయ్యిమీద పెట్టి పాలు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు క్రీం కలిపి మంట తగ్గించాలి. కాసేపటికి పాలు సగం అవుతాయి అప్పుడు గోధుమ రవ్వ చక్కెర వేసి బాగా కలపాలి. ఇది హల్వాలా అవుతున్నప్పుడు చాక్లెట్పొడీ, జీడిపప్పూ, బాదం పలుకులూ, మిగిలిన నెయ్యి వేయాలి. మధ్య మధ్య కలుపుతూ ఉంటే.. కాసేపటికి నెయ్యి పైకి తేలి.. మిశ్రమం దగ్గరకు అవుతుంది. అప్పుడు వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చదునుగా చేసి ముక్కల్లా కోయాలి. పైన పిస్తా పలుకులు చల్లితే చాలు. ఇది రెండు వారాలపాటు నిల్వ ఉంటుంది.