కావల్సినవి
పెసరపప్పు – కప్పు
చక్కెర, కోవా - కప్పు చొప్పున
నెయ్యి - అర కప్పు
కిస్‌మిస్ - కొన్ని
పెసరపప్పును కడిగి, మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి. తరవాత నీటిని వంపేసి ముద్దలా రుబ్బుకోవాలి . బాణలిలో నెయ్యి కరిగించి అందులో పెసరపప్పు ముద్ద వేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలపాలి. పెసరపప్పు ముద్ద ఉడికే కొద్దీ రంగు మారుతుంది. కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు దింపేయాలి. ఇప్పుడు మరో బాణలిలో కోవా తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అది కొద్దిగా వేడయ్యాక ముందుగా చేసుకున్న పెసరపప్పు ముద్ద కలపాలి. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యేలోగా చక్కెర పాకం పట్టుకోవాలి. చక్కెరలో కప్పు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగి లేతపాకం తయారవుతున్నప్పుడు దింపేసి కోవా మిశ్రమంలో వేసేయాలి. ఇది పూర్తిగా దగ్గరకు అయ్యాక దింపేసి ఓ పళ్లెంలోకి తీసుకుని ముక్కల్లా కోసి, కిస్‌మిస్‌తో అలంకరించాలి.