header

Groundnut Burfy


వేరుశెనగ బర్ఫీ

కావలసినవి
వేరుశెనగ గుండ్లు : 250 గ్రాములు
నెయ్యి : 1 టేబుల్ స్పూను
పంచదార : 150 గ్రాములు
కుంకుమ పువ్వు : కొద్దిగా
బాదం పప్పు : 25 గ్రాములు
పిస్తా పప్పు : 25 గ్రాములు
నీళ్లు : రెండు గ్లాసులు
తయారు చేసే విధానం
ముందుగా వేరుశెనగ గుండ్లను దొరగా వేయించి చల్లారిన తరువాత పొట్టు తీసి మెత్తగా పొడుం చేసుకోవాలి. బాదం పప్పు, పిస్తాపప్పులను కూడా దోరగా వేయించుకోవాలి. బాదం పప్పును చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. తరువాత పాన్ లో నీళ్లు చక్కెర వేసి పొయ్యిమీద పెట్టి లేతపాకం వచ్చేదాకా ఉండాలి. తరువాత వేరుశెనగ పప్పు పౌడర్ కొద్ది కొద్దిగా వేస్తూ ఉండకట్టకుండా కలుపుతుండాలి. ఇప్పుడు ముందుగా నేతిలో వేయించిన బాదం పప్పు, పిస్తా పప్పులను, కుంకుమపువ్వు, నెయ్యి వేసి బాగా కలపాలి. గరిటెతో బాగా కలయతిప్పి దించుకొని వెడల్పాటి పళ్లెంలో సమానంగా పరచాలి. ఆరిన తరువాత మనకు నచ్చే ఆకారాలలో కట్ చేసుకోవచ్చు.