header

Chapati

చపాతీలు

ఈ సాదా చపాతీలు ఎక్కువగా చేస్తుంటారు. వీటిని చేయటం కూడా చాలా సులభం
కావలిసినవి
గోధుమ పిండి : పావు కిలో (సుమారు గా ముగ్గురికి సరిపోతుంది)
ఉప్పు : కొద్దిగి
నూనె : ఒక టేబుల్ స్పూన్
వేడి నీరు : కొద్దిగా
తయారే చేసే విధానం
ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, తగినంత (సుమారుగా ఒక స్పూను) ఉప్పు వేసి, స్పూన్ నూనె కూడా వేసి వేడి నీరు కొద్ది కొద్దిగా పోస్తూ చపాతీ పిండిని మృదువుగా కలుపుకోవాలి. తరువాత తడిపిన నూలు వస్త్రం కప్పి అరగంట సేపు నాననివ్వాలి. తరువాత ఈ పిండిని కావలిసిన సైజులో తీసుకొని చపాతీలు ఒత్తుకోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొద్దిగా నూనెవేసి చపాతీలను రెండుప్రక్కలా చక్కగా కాలనివ్వాలి.
ఈ చపాతీలకు బంగాళా దుంప కూర, అరటి కూర, రాజ్మా గింజలతో చేసిన కూర, టమాటో కూర మంచి కాంబినేషన్