మెంతి చపాతీలు ఆరోగ్యానికి మంచివి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
కావలిసినవి
మెంతి ఆకులు : 150 నుండి 200 గ్రాములు
గోధుమపిండి : పావుకిలో
అల్లం ముక్క : చిన్నది
పచ్చిమిర్చి : 4 కాయలు
జీలకర్ర : 1 స్పూన్
పెరుగు : 2 స్పూన్లు
కొద్దిగా నూనె
ముందుగా మెంతి ఆకులను శభ్రంగా కడగాలి. 3 నిమిషాల పాటు ఉప్పునీటిలో నానబెట్టి కడిగితే మందుల అవశేషాలు తొలగిపోతాయి. మెంతి ఆకులను చిన్న చిన్నగా తరుగుకోవాలి. పచ్చిమిర్చి, అల్లంను పేస్ట్ చేసుకోవాలి.
తరువాత ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మెంతి ఆకులు అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పెరుగు, ఒక చెంచా నూనె వేసి తగినంత ఉప్పు కలిపి కొద్ది కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండి ముద్దగా కలుపుకోవాలి. పిండి గట్టిగా మృదువు ఉండాలి. తరువాత మీకు కావలిసిన సైజులో పిండి తీసుకొని రొట్టెల పీట మీద పొడి పిండి వేసి రొట్టెల కర్రతో చపాతీలు తయారు చేసుకోవాలి.
పెనం వేడెక్కిన తరువాత కొద్దిగా నూనె వేసి చపాతీలను రెండు వైపులా చక్కగా కాలనిచ్చి తీయాలి.
వీటినీ ఏదైనా కూరతో గానీ మామిడి, నిమ్మ, అల్లం, టమాటో పచ్చడితో కానీ లేక పెరుగుతో కానీ తినవచ్చు.