header

Palak Roti


పాలకూర చపాతీలు

కావలిసినవి
గోధుమ పిండి : పావు కిలో
పాలకూర : 150 నుండి 200 గ్రాములు
పచ్చిమిర్చి : 4 కాయలు
అల్లం : చిన్న ముక్క
నూనె : 2 స్పూన్లు
ఉప్పు : తగినంత
నూనె : చపాతీలు కాల్చటానికి కొద్దిగా
తయారు చేయు విధానం
ముందుగా పాలకూరను ఉప్పునీటిలో 3 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడగాలి. కాడలు తీసి వేసి ఆకులను మాత్రమే తీసుకోవాలి. పాలకూరను కొద్దిగా నీరు పోసి ఉడికించి మొత్తగా గ్రైండ్ చేయాలి.
తరువాత ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసి కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తరువాత మనకు కావలిసిన సైజులో పిండి ముద్దను తీసుకొని చపాతీలు తయారు చేసుకోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కిన తరువాత కొద్దిగా నూనె వేసి తయారుగా ఉన్న చపాతీలను రెండు వైపులా చక్కగా కాలనివ్వాలి.
వీటిని ఏదైనా కూరతో గానీ, చట్నీతో గానీ తినవచ్చు.

Untitled Document