header

Radish Chapateelu … ముల్లంగి చపాతీలు...

Radish Chapateelu … ముల్లంగి చపాతీలు...

కావల్సినవి:
గోధుమపిండి : 2 కప్పులు
ముల్లంగి తురుము : కప్పు
ముల్లంగి ఆకుల తరుగు : పావు కప్పు
పచ్చిమిర్చి : 4
ఉల్లిపాయ : ఒకటి
పసుపు : పావు టీ స్పూన్
నూనె : 3 టీ స్పూన్లు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : కొద్దిగా
తయారీ: ముందుగా ముల్లంగిని సన్నగా తురుముకోవాలి. తురిమిన ముల్లంగిని గట్టిగా చేతితో పిండితే నీరు వస్తుంది. దీనీని విడిగా ఉంచుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి వేసి అందులో ముల్లంగి తరుగు, ఆకుల తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, తురుమిన కొత్తిమీర కొద్దిగా. పసుపు, ఉప్పు, ఒక స్పూను నూనె వేసి ముల్లంగి నుండి పిండిన నీరు కలపుకొని వీటిని చపాతి పిండిలా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత వీటిని కావల్సిన సైజులో ఉండలు చేసుకొని, చపాతీలు చేసుకుని పెనం వెడెక్కిన తరువాత కొద్దిగా నూనె వేస్తూ రెండువైపులా చక్కగా కాల్చుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం.