చికెన్ : అరకిలో
అల్లం, వెల్లుల్లి : 5 టీస్పూన్లు
కారం : 5 టీ స్పూన్లు
ఉప్పు : తగినంత
నూనె : 4 టీస్పూన్లు
ఉల్లిముక్కలు : 2 కప్పులు
టమాటో గుజ్జు : 1 కప్పు
పచ్చిమిర్చి : నాలుగు
కరివేపాకు : 2 రెబ్బలు
ధనియాల పొడి : 2 టీస్పూన్లు
మిరియాల పొడి : అర స్పూను
కొత్తిమీర : కొద్దిగా
మసాలకోసం :
జీలకర్ర : టీ స్పూను, సోంపు అర టీస్పూను, లవంగాలు 4, యాలకులు : రెండు, దాల్చిన చెక్క: చిన్నముక్క
గసగసాలు : ఒక టేబుల్ స్పూన్
తయారు చేయువిధానం :
చికెన్ ముక్కలను బాగా కడిగి 4 టీస్పూన్ల కారం, 4 టీస్పూన్ల అల్లం వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలకు పట్టించి అరగంటసేపు నానబెట్టాలి. పచ్చిమిర్చిని సన్నగా తరుగుకోవాలి. బాణాలిలో కొద్దిగా నూనెవేసి మసాలా దినుసులను వేయించి దించుకోవాలి. చల్లారాక వీటిని పొడి చేసుకోవాలి.
బాణాలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి కరివేపాకు, మిగిలిన అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. తరువాత చికెన్ ముక్కలు., గరం మసాలా మిగిలిన కారం, దనియాలపొడి వేసి బాగా కలపాలి. నాలుగైదు నిమిషాలపాడు ఉడికిన తరువాత టమాటో గుజ్జువేసి నూనె తేలే వరకు ఉడికించాలి. తరువాత ఒక కప్పు నీరుపోసి తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాసేపు ఉడికించి దించబోయే ముందు కొత్తిమీర తురుము చల్లి దించుకోవాలి