చికెన్- అర కిలో
మెంతికూర- రెండు కట్టలు
కొత్తిమీర కట్ట
ధనియాల పొడి- చెంచా
పసుపు- చెంచా
పచ్చిమిర్చి- 6
అల్లం వెల్లుల్లిపేస్ట్- రెండు చెంచాలు
ఉల్లిపాయలు- రెండు
టమాటాలు- నాలుగు
జీలకర్ర- చెంచా
పెరుగు- మూడు చెంచాలు
గరంమసాలా- రెండు చెంచాలు
కారం- రెండు స్పూన్లు
ఉప్పు- తగినంత
వెడల్పాటి పాత్రలో నూనెవేసి వేడెక్కాక ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తరువాత జీలకర్ర, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ధనియాలపొడి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, చికెన్, పెరుగు వేసి తగినంత నీరు, ఉప్పు పోసి మూతపెట్టాలి. చికెన్ మ్తొతం ఉడికిన తర్వాత దీనికి మెంతి ఆకులు, కొత్తిమీర కలుపుకోవాలి. మెంతికూర ఉడికిన తర్వాత దింపుకోవాలి