header

Pudina Chicken…పుదీనా చికెన్

Pudina Chicken…పుదీనా చికెన్
కావల్సినవి
చికెన్‌- అరకేజీ
పుదీనా - కట్ట పావుకప్పు
కొత్తిమీర
చిన్న కొబ్బరిముక్క
ఉల్లిపాయలు : 1 పెద్దది
పచ్చిమిర్చి : 5
పసుపు : 1 స్పూన్
ఉప్పు : తగినంత
కారం : రెండు స్పూన్ లు
గరం మసాలా పొడి 1 స్పూన్
ధనియాల పొడి : 1 స్పూన్
తయారు చేసే విధానం
ముందుగా చికెన్‌ ని మారినేట్‌ చేసుకుని ఉంచుకోవాలి. ఇందుకోసం ముందుగా చికెన్‌ లో కొద్దిగా పసుపు, చెంచా కారం, చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్‌, చెంచా ధనియాల పొడి, రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో రెండు పెద్ద చెంచాల నూనె వేసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. సన్నగా తరిగిన పచ్చి మిర్చి, చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేయించి మారినేట్‌ చేసిన చికెన్‌ని వేసుకోవాలి. చికెన్‌ ఉడికిన తర్వాత పుదీనా వేస్ట్‌ వేసి బాగా కలిపి మళ్లీ మూతపెట్టుకోవాలి. చికెన్‌ ఉడికిన తర్వాత దీనికి కొద్దిగా గరంమసాలాపొడి, ధనియాల పొడి వేసి కలిపి దింపుకోవాలి.