header

Finger Millet Special…. రాగి సంగటి స్పెషల్

ఈనాడు ఆదివారం స్పెషల్...సౌజన్యంతో..
రాగిసంకటి ఎలా తయారు చేయాలి ? అందులోకి తగిన కూరలు...
రాగిసంగటికి సన్నబియ్యం అవసరం లేదు. లావుగా మోటుగా ఉండే ఏ బియ్యమైనా బాగానే ఉంటాయి. బియ్యాన్ని ఇరవైనిమిషాల పాటు ముందుగా నానించి ఉంచాలి. సంగటి చేయడానికి బియ్యంలో నాలుగో వంతు రాగిపిండి సరిపోతుంది. ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్లు తీసుకుని అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికిన తర్వాత నీళ్లు మొత్తం అందులోకి ఇంకిపోతాయి. అప్పుడు రాగిపిండి వేసి తెడ్డుకట్టె(గరిటె)తో కలిపి సిమ్‌లో ఉంచి మూతపెట్టాలి. ఐదునిమిషాల పాటు ఉంచిన తర్వాత మరో ఐదునిమిషాలు మూతతీసేసి సిమ్‌లో ఉంచితే రాగిపిండి మెత్తగా ఉడికిపోతుంది. నీళ్లు ఇంకకుండా రాగిపిండి వేస్తే రాగిపిండి గడ్డలు కడుతుంది.
రాగి సంకటిలోకి కూరలు...
కారం
ఊరుమిండి
చింతాకు పొడి
నాటుకోడి కూర
ఎండు నెత్తళ్ల పచ్చడి...
ఎండు చేప..ఎండు మాంసం ముక్కల కూర