కావలిసినవి
బొమ్మిడాయిలు : కిలో
ఉల్లిపాయలు : 2 పెద్దవి
పచ్చిమిర్చి : 4 కాయలు
టమాటోలు : 4 మీడియం సైజ్ వి
చింతపండు : 50 గ్రాములు
పసుపు : ఒక స్పూన్
కారం : 3 స్పూన్లు
కరివేపాకు రెబ్బలు : నాలుగు
కొత్తిమీర : కొద్దిగా
నూనె : 4 టేబుల్ స్పూన్లు
పుల్ల మామిడి కాయ : చిన్నది
తయారు చేసే విధానం
బొమ్మిడాయిలను శుభ్రం చేసుకోవాలి. చింతపండును వేడినీళ్ళలో నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకోవాలి. టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరుగుకోవాలి.
పాన్ లో గానీ, వెడల్పాటి పాత్రలో గానీ నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు వేసి ఇవన్నీ బాగా మెత్తబడేవరకు ఉంచాలి. తరువాత చేప ముక్కలను మామిడి ముక్కలు ఉప్పు, కారం పసుపు వేసి చక్కగా కలపాలి. తరువాత చింతపండు గుజ్జును వేసి మరొకసారి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కలిపి చక్కగా ఉడికిన తరువాత దించేముందు
కొత్తిమీర చల్లి వడ్డించాలి.