చేదుపరిగలు- పావుకిలో
చింతకాయలు- 150 గ్రా
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- ఆరు
నూనె- తగినంత
ధనియాలు - అరచెంచా
జీలకర్ర - అరచెంచా
అల్లం- కొద్దిగా
ఉప్పు- సరిపడేంత
ముందుగా మిక్సీలో ఉల్లిపాయలు ముక్కలూ, ధనియాలు, జీలకర్ర, అల్లం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత చింతకాయ ముక్కలని కూడా బరకగా మిక్సీ పట్టాలి. వెడల్పాటి మూకుడు తీసుకుని అందులో ముందుగా చింతకాయ మిశ్రమం, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆపై చేపలని పొరలుగా వేసుకుని, ఆపై నూనె, కొద్దిగా నీరు పోసి అప్పుడు పొయ్యి మీద పెట్టాలి. చిన్నసెగ మీద పెట్టుకుంటే కూర కాసేపటికి ఇగిరిపోతుంది. కూరని గరిటెతో కదిపితే చేపలు విరిగిపోతాయి. కాబట్టి మొత్తంగా మూకుడుని కదిపితే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరి.