header

Fish cutlets….బొచ్చెచేపలతో కట్ లెట్స్...

Fish cutlets….బొచ్చెచేపలతో కట్ లెట్స్...
కావలిసినవి
బొచ్చె చేప ముక్కలు – 10
తాజా అల్లం వెల్లుల్లి రెబ్బలు : 4 టీ స్పూన్ల పేస్ట్
పుదీనా ఆకు – ఒక కట్ట
పచ్చిమిర్చి – పది కాయలు
పొద్దుతిరుగుడు నూనె - అరకప్పు
తాజా కొబ్బరి తురుము - వంద గ్రా
ఉప్పు – సరిపడా
పసుపు - అరస్పూను
అరటిఆకులు – పెద్దవి నాలుగు
తయారు చేసే విధానం
ముందుగా పుదీనా ఆకులు, అల్లం తరుగు, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి తీసుకుని నీళ్లు పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి.
బొచ్చె చేప ముక్కలను బ్రెడ్ స్లైసులలాగా వెడల్పాటి ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పడు మందుగా తయారు చేసుకున్న మషాలాను ఒక్కోచేపముక్కకు పట్టించి ఒక గంటసేపు ఉంచాలి. తరువాత అరటి ఆకులను కొంచెం వెడల్పుగా కత్తిరించికొని వాటికి పైభాగంలో నూనె రాసి ఒకో దాంట్లో ఒకో చేపముక్కను ఉంచి అరటి ఆకుల అంచులను మడచి ఊడిపోకుండా దారంతో కట్టాలి.
వీటిని ఆవిరి మీద (ఇడ్లీ పాత్రలో) షుమారు 20 నుండి 25 నిమిషాల సేపు ఉడికించుకొని దించుకోవాలి. దీని వల్ల ఎక్కువగా నూనె వాడాల్సిన అవసరం ఉండదు. నిమ్మరసం, కొత్తిమీర తురుము చల్లుకోవచ్చు. వేడిగా తింటే రుచిగా ఉంటాయి