కావలిసినవి
చేపలు : 1 కె.జి
ఉల్లిపాయలు : పావు కిలో
పచ్చిమిర్చి : 4
పసుపు : అర స్పూను
చింతపండు గుజ్జు : అరకప్పు (చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టి పిండుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
కరివేపాకు : 4 రెమ్మలు
దనియాలపొడి : టేబుల్ స్పూన్
జీలకర్రపొడి : 1 స్పూన్
ఉప్పు : తగినంత
కారం : 4 స్పూన్లు
తయారు చేసే విధానం
చేపముక్కలను శుభ్రం చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరుగుకోవాలి. ముందుగా పాన్ లేక వెడల్పాటి పాత్రలో నూనె వేసి వేడెక్కిన తరువాత అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దనియాల పొడి, జీలకర్రపొడి, కరివేపాకు వేసికొద్దిగా వేగిన తరువాత చేపముక్కలు వేసి అందులో చింతపండు గుజ్జు కలపాలి. తగానంత ఉప్పు, పసుపు కూడా వేసి అన్నీ కలిసేటట్లు నెమ్మదిగా గరిటతో కలపాలి. కొద్దిగా నీరుపోసి చేప ముక్కలు ఉడికాక దించుకొని కొత్తిమీర చల్లి వడ్డించాలి.
కారం ఎక్కువగా తినేవారు ఇంకొద్దిగా కారం కలుపుకోవచ్చు. చేపల పులుసుకు బొచ్చెలు, కొరమీనులు, వంజిరం, పులస చేపలు, పండుకప్ప, చందువాలు పెద్దముక్కలు బాగుంటాయి.