header

Fish Fry


చేపల వేపుడు
చేపల వేపుడుకు బొచ్చె చేపలు, వంజిరం చేపలు, పండుగప్ప లేక కొంచెం పెద్ద చేపలు బాగుంటాయి. చేప తోకముక్కలు, చిన్నచేపలు ముళ్ళతో ఉండి తినటానికి అసౌకర్యంగా ఉంటుంది. కావలిసినవి
చేపముక్కలు : కిలో
కారం : 2 టీస్పూన్లు
ధనియాల పొడి : టీ స్పూను
మెంతిపొడి : అరస్పూను
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒకటేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత
పసుపు : టీస్పూను
నిమ్మరసం : 4 టీస్పూన్లు
నూనె : వేయించటానికి సరిపడినంత తీసుకోవాలి.
కొత్తిమీర : కొద్దిగా
బజారు నుండి కొనుగోలు చేసిన చేపముక్కలను అలాగా వండరాదు. వాటిని ఉప్పు కొద్దిగా మజ్జిగ కలిపి శుభ్రం చేసుకోవాలి తరువాతవాటిని చక్కగా కడిగాలి.
ఒక పాత్రలో కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, మెంతిపొడి, మిరియాలపొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నీరు పోసీ వీటన్నిటినీ పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని చేపలకు బాగా పట్టించి ఓ స్టీల్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో ఓ గంటసేపు ఉంచాలి. తరువాత బయటకు తీసి కొంచెంసేపు ఉంచితే చల్లదనం తగ్గి మాములుగా ఉంటాయి.
స్టవ్ మీద వెడల్పాటి పాన్ లేక నాన్ స్టిక్ కుక్ వేర్ కానీ పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత మంట సిమ్ లో ఉంచి చేపముక్కలను పరవాలి. ఓ అయిదు నిమిషాల తరువాత చేపముక్కలను రెండవపక్కకు త్రిప్పాలి. మంటను మీడియంలో పెట్టి చేపేముక్కలను రెండుప్రక్కలా బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించి దించుకొని నిమ్మరసం, కొత్తిమీర చల్లుకొని కొద్దిగా ఆరిన తరువాత వడ్డించాలి.