header

Kerala Fish Fry


Kerala Spicy Fish Fry / కేరళ స్పైసీ ఫిష్ ఫ్రై
చేపల వేపుడుకు బొచ్చె చేపలు, వంజిరం చేపలు, పండుగప్ప లేక కొంచెం పెద్ద చేపలు బాగుంటాయి. చేప తోకముక్కలు, చిన్నచేపలు ముళ్ళతో ఉండి తినటానికి అసౌకర్యంగా ఉంటుంది. చేపలు - అరకేజీ,
కారం - నాలుగు చెంచాలు
పసుపు- పావు చెంచా
అల్లంముక్క- చిన్నది
మిరియాలు - చెంచా
కరివేపాకు- నాలుగు రెబ్బలు
ఉప్పు - తగినంత
నూనె- వేయించేందుకు సరిపడా
ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి. అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
- సేకరణ ఈనాడు దినపత్రిక నుండి