చేప ముక్కలు -150 గ్రాములు
కొబ్బరి ముక్కలు - అర కప్పు
పసుపు – చెంచా
అల్లం తరుగు – చెంచా
పచ్చిమిర్చి – ఒకటి
చింతపండు గుజ్జు - మూడు చెంచాలు
ఉల్లిపాయలు - రెండు, మినప్పప్పు
ఆవాలు - అరచెంచా చొప్పున
కరివేపాకు - రెండు రెబ్బలు
కొబ్బరి నూనె - రెండు చెంచాలు
ఉప్పు – తగినంత
కారం –చెంచా.
కొబ్బరి ముక్కలూ, పసుపూ, అల్లం తరుగూ, కారం, తగినంత ఉప్పూ, చింతపండు గుజ్జూ, పచ్చిమిర్చీ, అరచెంచా నీళ్లు మిక్సీలో తీసుకుని ముద్దలా చేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి చెంచా నూనె వేయాలి. అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని వేయాలి. ఐదు నిమిషాలు వేయించి.. అందులో చేపముక్కలను వేసి బాగా కలిపి దింపేయాలి. మరో గిన్నెను పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక మినప్పప్పూ, ఆవాలూ, కరివేపాకు వేసి ఆ తాలింపులో చేప ముక్కల్ని వేసి మూత పెట్టేయాలి. అవి ఉడికి కూరలా తయారయ్యాక దింపేయాలి.
- సేకరణ ఈనాడు దినపత్రిక నుండి