header

Kerala Fish Masala / ఫిష్ మసాలా


Kerala Fish Masala / ఫిష్ మసాలా
కావల్సినవి
చేపముక్కలు – ఆరు
కారం - ఒకటిన్నర చెంచా
పసుపు- పావు చెంచా
ధనియాల పొడి
మిరియాలపొడి - అరచెంచా చొప్పున
నిమ్మ కాయ – అరచెక్క
అల్లం, వెల్లుల్లి ముద్ద - అరచెంచా
ఉప్పు – తగినంత
మసాలా కోసం
ఉల్లిపాయలు, టొమాటోలు - రెండు చొప్పున, కొబ్బరి పాలు - పావు కప్పు, కారం - చెంచా, పసుపు - పావు చెంచా, ధనియాల పొడి- ముప్పావు చెంచా, మిరియాల పొడి - పావు చెంచా, గరంమసాలా - అరచెంచా, మెంతిపొడి - చిటికెడు, అల్లం వెల్లుల్లి ముద్ద - అరచెంచా, పచ్చిమిర్చి - మూడు, కరివేపాకు - రెండు రెబ్బలు, కొబ్బరి నూనె- అరకప్పు, ఉప్పు - తగినంత.
: ఓ గిన్నెలో అల్లం, వెల్లుల్లి ముద్ద, కారం, పసుపూ, ధనియాలపొడీ, మిరియాల పొడీ, నిమ్మరసం, తగినంత ఉప్పు తీసుకుని ముద్దలా కలపాలి. అందులో చేపముక్కలను వేసి వాటికి ఆ మసాలా పట్టేలా బాగా కలిపి అరగంట సేపు పక్కన పెట్టేయాలి. తర్వాత కొబ్బరిపాలు నూనె తప్ప మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి పావుకప్పు నూనె వేయాలి. అది వేడయ్యాక చేపముక్కలు వేసి వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి ముందుగా చేసుకున్న మసాలా వేసి బాగా వేయించాలి. అందులో కొబ్బరిపాలు పోసి మంట తగ్గించాలి. ఐదారు నిమిషాలయ్యాక ముందుగా వేయించిన చేపముక్కల్ని వేయాలి. అవి ఉడికి కూరలా తయారయ్యాక ఇంకొంచెం ఉప్పు వేసి దింపేయాలి.
- సేకరణ ఈనాడు దినపత్రిక నుండి