header

Kerala Fish - Nethili fish fry / నెత్తిలి చేపల ఫ్రై


Kerala fish - Nethili fish fry / నెత్తిలి చేపల ఫ్రై
కావలిసినవి
నెత్తిలి చేపలు - పావుకేజీ
నూనె - వేయించేందుకు సరిపడా.
మసాలా కోసం: చిన్న ఉల్లిపాయలు - ఎనిమిది
వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
అల్లం ముక్కలు - రెండు
కారం - చెంచా
పసుపు - చిటికెడు
మిరియాల పొడి - పావు చెంచా
మైదా - మూడు చెంచాలు
గుడ్డు - ఒకటి ఉప్పు - తగినంత.
ముందుగా చేపలు శుభ్రం చేసి పెట్టుకోవాలి. అల్లం, మిరియాలు, కరివేపాకును మిక్సీలో ముద్దలా నూరుకోవాలి. ఈ మిశ్రమానికి కారం, పసుపు, ఉప్పు, చెంచా నీళ్లు కలిపి చేప ముక్కలకు పట్టించాలి. అరగంటయ్యాక బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది బాగా కాగిన తరువాత ఒక్కొక్క చేపను వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
- సేకరణ ఈనాడు దినపత్రిక నుండి