నెత్తిలి చేపలు- అర కేజీ
ఉల్లిపాయలు – రెండు
అల్లం ముక్కలు- చెంచా
టొమాటోలు – రెండు
నూనె - నాలుగు చెంచాలు
కరివేపాకు- నాలుగు రెబ్బలు
చింతపండు రసం- కప్పు
కారం - రెండు చెంచాలు
ధనియాలపొడి – చెంచా
ఉప్పు – తగినంత
పసుపు – పావుచెంచా
చేపలను శుభ్రం చేసుకున్నాక వాటిపై పసుపూ, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసాన్ని ఉడికించి పెట్టుకోవాలి. ఇందులో కారం, ధనియాలపొడీ వేయాలి. అల్లం, ఉల్లిపాయముక్కలను మిక్సీలో వేసి మెత్తని ముద్దలా చేసుకుని తీసుకోవాలి. అదే విధంగా టొమాటో ముక్కల్ని కూడా ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక కరివేపాకూ, ముందుగా చేసిపెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసి వేయించాలి. ఉల్లిపాయ ముద్దలోని పచ్చివాసన పోయాక టొమాటో ముద్ద వేయాలి. అది బాగా ఉడికాక చింతపండు గుజ్జూ, ఇంకొంచెం ఉప్పూ వేయాలి. ఈ రసం బాగా ఉడికిందనుకున్నాక చేపల్ని వేసి మంట తగ్గించాలి. పది నిమిషాల్లో చేపలు ఉడుకుతాయి. అప్పుడు దింపేయాలి.
- సేకరణ ఈనాడు దినపత్రిక నుండి