పచ్చిమిర్చి పచ్చడి
కావలిసినవి
పచ్చిమిర్చి : 100 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు : 6
జీలకర్ర : ఒక స్పూన్
పసుపు : కొద్దిగా
ఉప్పు : తగినంత
పల్లీలు : కొద్దిగా (వేయించినవి)
నూనె : ఒక టేబుల్ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
తయారు చేసే విధానం
ముందుగా పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడిగి నిలువు చీల్చుకోవాలి. పాన్లో నూనె వేసి వేడెక్కిన తరువాత పచ్చిమిరపకాయలను, వేరుశెనగప్పును, ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఇవి చల్లారిన తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇడ్లీ, దోసె అన్నంలోని ఈ పచ్చడి మంచి కాంబినేషన్