కావలిసినవి:
పచ్చిమిర్చి : పావుకిలో
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
కరివేపాకు : నాలుగు రెమ్మలు
ధనియాలు, గసగసాలు, నువ్వులు, జీలకర్ర : అన్నీ కలిపి నాలుగు స్పూన్లు
పసుపు : పావు స్పూన్
కొత్తిమీర : తురిమినది కొద్దిగా
ఉప్పు : తగినంత
ఆవాలు : 1 స్పూన్
చింతపండు గుజ్జు : పావు కప్పు
నూనె : 50 గ్రాములు
తయారు చేసే విధానం
ముందుగా నువ్యులు, జీలకర్ర, గసగసాలు, ధనియాలను దోరగా వేయించి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వాటిలోని గింజలను తీసివేయాలి. పచ్చిమిర్చిలో గ్రైండ్ చేసిన పొడిని కొద్ది కొద్దిగా కూరాలి.
పాన్ లో తగినంత నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి దోరగా వేగిన తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి, కొద్దిగా వేగిన తరువాత మషాలా కూరిన పచ్చిమిర్చిని వేసి చింతపండు గుజ్జును కూడా వేసి కొద్దిగా నీళ్ళు కూడా కలపాలి. పచ్చిమిర్చి పూర్తిగా ఉడికే వరకు ఉంచి దించుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మంచి రుచి వస్తుంది.