header

Beetroot Halva


బీట్ రూట్ హల్వా

కావల్సినవి

రెండుకప్పుల తురిమిన బీట్ రూట్ పంచదార : మూడుచెంచాలు
ఏలకుల పొడి : పావుస్పూన్
పాలు : ఒక కప్పు
నెయ్యి : ఒక స్పూన్
బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ లు : కొద్దిగా
తయారు చేసే విధానం
పాలను తక్కువమంటపై కొద్దిగా చిక్కగా అయ్యేవరకు మరగపెట్టాలి. కళాయిలో నెయ్యివేసి అందులో జీడిప్పులు, బాదం, కిస్మిస్ లు, పిస్తాపప్పులు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని విడిగా పెట్టుకొని బీట్ రూట్ ను కూడా కొంచెం సువాసన వచ్చేవరకు రెండు మూడు నిమిషాలపాటు వేయించాలి. ఇప్పుడు బీట్ రూట్ తురుములో మరిగించిన పాలను పోసి పాలతో పాటు బీట్ రూట్ బాగా కలిసిపోయేంతవరకు ఉడకనివ్వాలి.
పంచదార, ఏలకులపొడి కలిపి బాగా కలియబెట్టాలి పంచదార కరిగి కలిసేవరకు ఉంచి, తరువాత నీరంతా ఆవిరి అయ్యేదాకా ఉంచండి.
ఈ హల్వాను నెయ్యిరాసిన ప్లేట్ లో ఉంచి దానిపై జీడిపప్పు, కిస్మిస్, పిస్తాపప్పు, బాదం పప్పులు సమానంగా పరచాలి.