సొరకాయ: అరకిలో
పంచదార: కప్పు
కోవా: కప్పు
పాలు: అరలీటరు
ఎండుద్రాక్ష: పది
నెయ్యి: 3 టీస్పూన్లు
వేరుశెనగ పప్పు : 50 గ్రాములు
యాలకులపొడి: టీస్పూను
ముందుగా సొరకాయ తొక్కతీసి తురుముకోవాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి వేరుశెనగపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి. తరవాత సొరకాయ తురుము వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. తరువాత పాలు పోసి బాగా కలపాలి. పంచదార, కోవా, యాలకుల పొడి వేసి దగ్గరగా ఉడికించి దించితే హల్వా రెడీ.