కావలసినవి
బ్రెడ్ : 1 (రాగి లేక గోధుమ బ్రెడ్)
పాలు : 1 లీటరు
చక్కెర : 150 గ్రాములు
జీడిపప్పు : 50 గ్రాములు
నెయ్యి : 50 గ్రాములు
యాలకుల పొడి : 5 లేక 6 యాలకులు
ముందుగా బ్రెడ్ ను అంచులు తీసివేసి నాలుగు ముక్కలుగా చేసికొని పెనంమీద నెయ్యివేసి రెండు వైపులా కాల్చాలి. ఈ ముక్కలు చల్లారిన తరువాత చేత్తో నలిపితే పొడుంలాగా అవుతాయి.
ఇప్పుడు పొయ్యిమీద వెడల్పాటి పాత్రలో పాలుపోసి బాగా మరిగించాలి. మరిగిన తరువాత చక్కెర కలిపి మంటను తగ్గించాలి. ఇందులో బ్రెడ్ పొడిని కలుపుతూ ఉండకట్టకుండా అట్లకాడతో త్రిప్పుతుండాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యి, జీడిపప్పు, యాలకులు వేసి బాగా కలిసేటట్లు త్రిప్పి దించుకోవాలి