మామిడిగుజ్జు: 4 కప్పులు
బాదం పప్పు : పావుకప్పు
యాలకులపొడి: అరటీస్పూను
జీడిపప్పు: పావుకప్పు
కార్న్‌ఫ్లోర్: కప్పు
నెయ్యి: అరకప్పు
పంచదార: 2 కప్పులు
మంచినీళ్లు: కప్పు
ఓ పాన్‌లో పావు కప్పు నెయ్యి వేసి మామిడిపండు గుజ్జు వేసి కొద్దిగా వేడి చేయాలి. కార్న్‌ఫ్లోర్‌లో నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలిపి పాన్‌లో వేసి మొత్తం మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ ఉడికించాలి. తరవాత పంచదార వేసి మిశ్రమం అంచుల నుంచి వేరయ్యేవరకూ ఉడికించాలి. తరవాత మిగిలిన నెయ్యి కూడా వేసి కలుపుతూ పది నిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన బాదం, వేయించిన జీడిపప్పు, యాలకులపొడి వేసి కలపాలి. మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులోకి తీసి పూర్తిగా చల్లారాక అందించాలి.