header

అరటి పండ్ల ఐస్‌క్రీమ్‌ / Banana Ice Cream

అరటి పండ్ల ఐస్‌క్రీమ్‌ / Banana Ice Cream

కావాల్సినవి
అరటిపళ్లు – 3 లేదా 4
తేనె – 1 కప్పు
పాలు – అర కప్పు
తయారు చేసే విధానం
: ముందుగా అరటి పళ్లను గుండ్రటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత వాటిని ఒక 10 లేదా 15 నిమిషాలు పాటు మైక్రోవేవ్‌ ఓవెన్‌లో పెట్టుకోవాలి. తరువాత ఆ అరటి ముక్కలను ఒక మిక్సీలో వేసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో తేనె, పాలు కలిపి మరో సారి మిక్సీ పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే బనానా ఐస్‌క్రీమ్‌ రెడీ. చల్లబడ్డాక ఈ ఐస్‌క్రీమ్‌ను చక్కగా ఆస్వాదించవచ్చు