గుడ్లు – 2
పాలు – 5 కప్పులు
చక్కెర – 1 కప్పు
బేకింగ్ సోడా – ఒక టేబుల్ స్పూన్
బటర్ – పావు కప్పు (కరిగించి)
కొబ్బరి పాలు –1 కప్పు
కొబ్బరి తురుము – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్
వెనీలా – 2 చుక్కలు (అభిరుచిని బట్టి)
ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో నాలుగు కప్పుల పాలు, చక్కెర కలుపుకుని గరిటెతో తిప్పుతూ బాగా మరిగించాలి(సుమారు రెండు కప్పులు అయ్యేలా). లేత పసుపు రంగులోకి వచ్చిన పాల్లో బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత బటర్‌ను కరిగించుకుని మిగిలిన పాలల్లో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు, ముందుగా కలుపుకుని పక్కనపెట్టుకున్న రెండు మిశ్రమాలను పోసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అందులో వెనీలా ఫ్లేవర్ లేదా మీకు నచ్చిన ఫ్లేవర్‌ను యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. చివరిగా ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కోకోనట్ ఐస్‌క్రీమ్ మీ సొంతమవుతుంది.