header

ఖర్జూరం ఐస్‌ క్రీమ్‌/ Dates Ice Cream

ఖర్జూరం ఐస్‌ క్రీమ్‌/ Dates Ice Cream

కావాల్సినవి
పంచదార – అర కప్పు
నీరు – 1 కప్పు
ఖర్జూరం – 10 లేదా 15 (గింజలు తీసినవి)
పాలు –2 కప్పులు
గుడ్లు – 3 (పచ్చసొన మాత్రమే)
వెనీలా – 2 చుక్కలు
తయారు చేసే విధానం
ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో పంచదార, నీరు వేసుకుని... పంచదార కరిగేదాకా మరిగించాలి. తరువాత అందులో ఖర్జూరం వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత మిక్సీలో (మరీ మెత్తగా కాకుండా) మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్‌ తీసుకుని అందులో పాలు, గుడ్లు యాడ్‌ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండు మిశ్రమాలను ఒక బౌల్‌లో కలుపుకొని ఐస్‌క్రీమ్‌ మేకర్‌లో కానీ డీప్‌ ఫ్రిజ్‌లో కానీ పెట్టుకుంటే నోరూరించే ఖర్జూరం ఐస్‌క్రీమ్‌ తయారుచేసుకోవచ్చు.