ద్రాక్షపళ్లు – అర కిలో
నిమ్మకాయ – 1
పంచదార పొడి – ఒక కప్పు
పాలు – 1 కప్పు
గుడ్డు – 1 (తెల్ల సొన మాత్రమే)
ముందుగా ద్రాక్షపళ్లను జ్యూస్ చేసుకుని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్‌లో నిమ్మరసం, గుడ్డు కలుపుకుని ఒక 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని అందులో పాలు, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. తరువాత జ్యూస్ ఫ్రిజ్‌లోంచి బయటికి తీసి అందులో ఈ పాల మిశ్రమాన్ని యాడ్ చేసుకుని డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రుచికరమైన ద్రాక్ష ఐస్‌క్రీమ్ మిమ్మల్ని చల్లబరుస్తుంది.