కావాల్సినవి
మామిడి పళ్లు – 2 లేదా 3
పాలు – 3 కప్పులు
చక్కెర – అర కప్పు
బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూన్
తేనె – 1 టేబుల్ స్పూన్
పిస్తా – పావు కప్పు
ముందుగా మామిడి ముక్కలు పిస్తా కలిపి జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకుని పాలలో చక్కెర వేసి గరిటెతో తిప్పుతూ మరిగించాలి. పాలు బాగా చిక్కగా (గ్లాస్ పాలు అయ్యేదాకా) మరిగించి, అందులో బేకింగ్ సోడా, తేనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మ్యాంగో–పిస్తా జ్యూస్, పాల మిశ్రమాన్ని జోడించి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని డీప్ కూల్ చేసుకుంటే మామిడి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత చీజ్ తురుముతో గార్నిష్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.