రాగి పిండి – 4 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
నీళ్లు – రెండు కప్పులు
మజ్జిగ – అరకప్పు
జీలకర్ర – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా
పచ్చి మిర్చి – 1
మిరియాల పొడి కొద్దిగా
ఉల్లిపాయ : చిన్నది ఒకటి
క్యారెట్ తురుము : 1 స్పూను
ముందుగా ఒక గిన్నెలో సగం గ్లాసు నీ నీళ్లు తీసుకొని అందులో రాగిపిండి వేసి స్పూనుతో బాగా కలపాలి. ఉండలు లేకుండా కలపాలి. ఒక పాత్రలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి మరుగుతున్న నీళ్లలో నీళ్లు కలిపిన రాగి పిండి కలిపిన మిశ్రమం కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి, ఉప్పు కూడా వేసి కలపాలి. ఉడికాక దించుకుని చల్లారాక మజ్జిగ, జీలకర్ర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, సన్నగా కోసిన ఉల్లిపాయ, మిరియాల పొడి, కొత్తిమీర కలుపుకోవచ్చు