header

Ragi Java రాగి జావ బెల్లంతో...

Ragi Java రాగి జావ బెల్లంతో...
కావలసినవి
రాగి పిండి – 4 టేబుల్‌ స్పూన్లు
బెల్లం పొడి – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు
నీళ్లు – మూడు కప్పులు
పాలు లేక మజ్జిగ – ఒకటిన్నర కప్పులు
ఏలకుల పొడి – చిటికెడు
డ్రై ఫ్రూట్స్‌ – కొద్దిగా
తయారు చేసే విధానం
:ఒక పాత్రలో నీళ్లు బాగా మరిగించి అందులో రాగి పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి ఉడికిన తరువాత పాలు కూడా కలిపి, బెల్లం పొడి వేసి బాగా కలపాలి . దించుకునే ముందు ఏలకుల పొడి కలుపు కోవచ్చు. మజ్జిగ తో అయితో రాగి జావ ఉడికేపుడు పాలు పోయ పోయకుండా రాగి జావ ఉడికించుకుని దించుకుని చల్లారిన తరువాత మజ్జిగ కలుపుకోవాలి. ఇందులో డ్రైఫ్రూట్స్ కలుపుకోవచ్చు