కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ - 200 గ్రా.
పెసరపప్పు - 100 గ్రా.
మిరియాలు - 1టీస్పూన్
ఉల్లిపాయ - పెద్దది
నూనె - 2 టేబుల్ స్పూన్
ఉప్పు - తగినంత
నీరు – 1 లీటర్
: జొన్న రవ్వ ఉడకడానికి ఎక్కువ నీరు, సమయం అవసరం కాబట్టి ముందుగానే తగినంత నీరు పోసి ఉడికించుకోవాలి. పెసరపప్పును తగినంత నీరు పోసి ముందుగానే నానబెట్టాలి. బాగా కాగిన నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మిరియాలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పెసరపప్పు వేసి కొంచెం నీరు పొసి ఉడకనివ్వాలి. పప్పు ఉడికిన తర్వాత ఉడికించిన జొన్నరవ్వ, ఉప్పు వేసి కలిపి దించాలి.