Jonna Rottelu/Jowar Chapati జొన్న రొట్టెలు
కావలసినవి
జొన్నపిండి : అరకిలో
నీరు తగినంత
ఉప్పు : తగినంత
తయారు చేయువిధానం :
ఒక చిన్న పాత్రలో ఉప్పు వేసి తగినంత నీరు పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి.
కొద్దిగా పిండిని తీసుకుని చిన్నఉండలా చేసి మెల్ల మెల్లగా రొట్టెల పీటమీద చేతితో గుండ్రంగా వత్తుకోవాలి. లేదా కొద్దిగా గోధుమ పిండి కలిపితే చపాతీలాగా రొట్టెల కర్రతో రొట్టెలు చేయవచ్చు.
స్టౌమీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత రొట్టెను దానిమీద వేసి ఒక పక్క కాలిన తరవాత రెండవ పక్కకూడా కాల్చుకోవాలి.
ఇదే పద్దతిలో రాగి, సజ్జ పిండితో కూడా రొట్టెలు చేసుకోవచ్చ. నూనె కావలిసిన వారు కొద్దిగా నూనెతో కాల్చుకోవచ్చు.