కొర్రలతో చక్రాలు
కావలసిన పదార్థాలు
కొర్రలు : కిలో
మినప గుండ్లు : పావుకిలో
జిలకర్ర : 1 టేబుల్ స్పూను
నువ్వులు : 2 టేబుల్ స్పూన్లు
ఇంగువ : కొద్దిగా
మిరియాల పొడి : అరటీ స్పూను
నూనె : తగినంత
తయారు చేయువిధానం :
ముందుగానే మినప గుండ్లు, కొర్రలు బాగా ఎండబెట్టి మొత్తగా పిండిపట్టించుకోవాలి.
ఒక పెద్ద పాత్రలో పిండి వేసి జీలకర్ర, మిరియాలపొడి, ఇంగువ, నువ్వులు వేసి కొద్దిగా నూనె వేడిచేసి అందులో పోసి నీళ్ళు పోస్తూ జంతికల పిండి మాదిరిగా కలుపుకోవాలి. బాణాలిలో తగినంత నూనెపోసి కాగనివ్వాలి.
చక్రాల గిద్దలలో ఈ పిండిని నింపి చక్రాలలాగా వేసి కాలిన తరువాత పేపర్ మీద కానీ పేపర్ న్యాప్ కిన్ మీదకానీ పరిస్తే ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకుంటుంది.
a
కొర్రలు, సెనగపిండితో చక్రాలు
కావలసిన పదార్థాలు
కొర్ర పిండి – 1 కేజీ
శనగ పిండి – అర కేజీ
జీలకర్ర - 20 గ్రా.
కారం - 25 గ్రా.
నువ్వులు - 25 గ్రా.
నూనె - 1 కేజీ
తయారు చేయువిధానం : శనగ పిండిని కొర్ర పిండిని కలిపి జల్లెడ పట్టుకోవాలి. ఆ మిశ్రమానికి జీలకర్ర, కారం, నువ్వులు కలపాలి. 50 గ్రా. వేడి నూనె తీసుకొని ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. వేడీ నీరు పోస్తూ మురుకుల పిండిలా కలుపూకోవాలి. పాన్ లో నూనె పోసి కలిపి పెట్టుకున్న పిండిని చక్రాల గిద్దలలో వేసి చక్రాలు వేసి వేయించుకోవాలి.