కావలసిన పదార్థాలు
కావలసిన పదార్థాలు
కొర్రలు - 2 కప్పులు
మినపప్పు - 1 కప్పు
శనగపప్పు - 2 టీ స్పూన్
మెంతులు – అర టీ స్పూను
ఉప్పు - తగినంత
కొర్రలు, మినపప్పు, శనగపప్పును కడిగి వేరు వేరుగా 4 గంటల సేపు నానబెట్టాలి. ఈ పప్పును కొర్రలను వేరు వేరుగా మిక్సిలో వేసి రుబ్బుకోవాలి. కొంచెం ఉప్పును వేసి రుబ్బుకున్న వాటిని బాగా కలిపి ఒక రాత్రంతా పులియబెట్టాలి. అవసరమైతే కొంచెం నీరు కలిపి దోసె పిండిలాగా తయారుచేసుకొని దోసెలు వేసుకోవాలి.