కావలసిన పదార్థాలు
కొర్ర బియ్యం - 2 కప్పు
నీరు (ఎసరు కోసం)- 4 కప్పులు
నిమ్మరసం - తగినంత
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
పసుపు - కొద్దిగా
కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు , జీలకర్ర, మినపప్పు, పల్లీలు - తాళింపు చేసుకోవడానికి తగినంత
కొర్రబియ్యంలో ఎసరు పోసి కుక్కర్ లో అన్నంలాగా వండుకోవాలి.
ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలు నూనెలో వేసి తాళింపు చేసుకోవాలి. ఉడకబెట్టిన అన్నానికి ఉప్పు, పసుపు
కలుపుకొని తాళింపులో వేయాలి. దించిన తరువాత అన్నం కొద్దగా చల్లారిన తరువాత నిమ్మరసం కలుపుకోవాలి.ఈ పులిహోరను కనీసం ఒక గంటసేపు ఉంచితే నిమ్మరసం బాగా పడుతుంది.