రాగిపిండి : 1 కప్పు
తుమిన కప్పు : అరకప్పు (ఎండె కొబ్బరి లేక పచ్చకొబ్బరి)
పెరుగు : అరకప్పు
ఉప్పు : రుచికి తగినంత
నీళ్లు
నూనె : కొద్దిగా
ఒక వెడల్పాటి గిన్నెలో రాగిపిండి, కొబ్బరి తురుము గిలకొట్టిన పెరుగు, తగినంత ఉప్పేవేసి బాగా కలపాలి. మామూలు దోసె పిండికంటే కొద్దిగా జారుగా కలపాలి. అరగంట పక్కన పెట్టాలి. తరువాత పెనం వేడెక్కిన తరువాత కొంచెం నూనె వేసి రాగిపిండిని దోశలాగా వేసుకోవాలి. ఇది మంచి పౌష్టికాహారం.
డా.లహరి సూరపనేని, న్యూట్రిషనిస్ట్, వెల్ నెస్ కన్సల్టెంట్