ఉప్పుడు బియ్యం - 1 కప్పు
మినప పప్పు - 1/2 కప్పు
సగ్గుబియ్యం - 1/4 కప్పు
రాగి పిండి - 1 కప్పు
మెంతులు - 1/4 టీ స్పూన్
ఉప్పు- తగినంత
నూనె – తగినంత
ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం కలిపి 4-5 గంటల వరకు నానబెట్టాలి. మినప పప్పు, మెంతులు కలిపి 3-4 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన ఉప్పుడుబియ్యం, సగ్గుబియ్యం ను మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న మినప పప్పు, మెంతుల్ని కూడా మెత్తగా రుబ్బుకుని ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకొని, దానిలోనే రాగి పిండి వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసి కలిపి మూత పెట్టాలి. పిండిని పులియబెట్టి, దోసెలు వేసుకొని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.