రాగి పిండి 1/4 కప్పు
ఉప్పు - తగినంత
నీరు - 1 కప్పు
మజ్జిగ - తగినంత
నూనె
ఆవాలు
కరివేపాకు
కొత్తిమీర
పచ్చిమిరపకాయలు 2
రాగి పిండిలో కొద్ది నీరు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని పొయ్యి మీద పెట్టి జావలా అయ్యే వరకు వేడి చేయాలి. తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, మజ్జిగ కలుపుకుని తాగితే రుచి ఉంటుంది. మజ్జిగ బదులు పాలు కూడా కలుపుకోవచ్చు. పాలు కలిపినపుడు పచ్చిమిరపకాయలు వేయకూడదు.